నారా లోకేష్ ను కలిసిన పత్తికొండ ఎమ్మెల్యే కె. ఈ. శ్యాంబాబు

80చూసినవారు
నారా లోకేష్ ను కలిసిన పత్తికొండ ఎమ్మెల్యే కె. ఈ. శ్యాంబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కె. ఈ. శ్యాం బాబు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అంద చేశారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, యువ నాయకుడు ఆధ్వర్యంలో పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని నారా లోకేష్ ను కోరారు.