ఏపీలోని విజయవాడలో ఈసారి వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. బుడమేరు వరద నీటిలో చాలా ప్రాంతాలు మునిగి ఉన్నాయి. దీంతో వినాయక చవితిపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఈసారి వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టించే విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలనే అంశంపై నగర పాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఓ ప్రకటన చేశారు. ఈసారి వినాయకుని నిమజ్జనం సీతమ్మ వారి పాదాలు వద్ద గల కృష్ణానదిలో చేయాలని భక్తులని కోరారు.