ప్రకాశం బ్యారేజీకి బోట్స్ ఢీకొన్న వ్యవహారంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే ఉద్దేశపూర్వకంగా బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టడం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో బ్యారేజీని ఢీకొన్న బోట్లు ఎవరివి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరులకు చెందిన బోట్స్గా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.