వెల్దుర్తి: 16న చేపల చెరువుకు వేలం:ఆఫీసర్ ఓబులేశ్ గౌడ్

68చూసినవారు
వెల్దుర్తి: 16న చేపల చెరువుకు వేలం:ఆఫీసర్ ఓబులేశ్ గౌడ్
వెల్దుర్తి సమీపంలో అటవీశాఖ పరిధిలోని వీరన్నగట్టు చెరువులో చేపల పెంపకానికి ఈనెల 16న వేలం నిర్వహించనున్నట్లు కర్నూలు ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఓబులేశ్ గౌడ్ తెలిపారు. 2024 జులై 1వ తేదీ నుంచి 2025 జూన్ 30వ తేదీ వరకు ఏడాది కాలపరిమితిలో చేపలు పెంచుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు రూ. 1000 ధరావత్తు చెల్లించి పాల్గొనాలన్నారు. కర్నూలు రేంజ్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వేలం పాట జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్