కిశోర బాలికలు ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి"
కిశోర బాలికలు ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని ఆళ్లగడ్డ ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి తేజేశ్వరి సూచించారు. ఆళ్లగడ్డ మండలంలోని కోట కందుకూరులోని కస్తూర్బా ఉన్నత పాఠశాలలో బుధవారం కిశోర బాలికల వ్యక్తిగత పరిశుభ్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. కిశోర బాలికలు రుతుక్రమం సమయంలో పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారన్నారు.