సీఎం కావాలనే కోరిక లేదు: ఉద్ధవ్ ఠాక్రే

79చూసినవారు
సీఎం కావాలనే కోరిక లేదు: ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ శివసేన (UBT) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదన్నారు. అహ్మద్నగర్లో ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈమేరకు ప్రసంగించారు. సీఎం అభ్యర్థి ఎవరినేది ప్రకటించకుండానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు 'మహావికాస్ అఘాడీ' మిత్రపక్షాలు సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తోన్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్