ప్రహ్లాద వరద స్వామి కాళింగ నర్తనోత్సవ అలంకారంలో దర్శనం
కర్నూల్ జిల్లా అహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదపండితులు జ్వాలా నృసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. పల్లకిపై స్వామి, అమ్మవార్లను కొలువుంచి ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్లను కొలువుంచారు. అర్చకులు, బోయీలు రథాన్ని లాగుతూ ముందుకు కదిలారు. రథంపై కొలువుదీరిన స్వామి, అమ్మవార్లు ఆలయ ప్రాంగణంలో విహరించారు. ఈ ఉత్సవాన్ని తిలకించిన భక్తాదులు తన్మయత్వానికి లోనై గోవింద నామస్మరణ చేశారు.దిగువ అహోబిలంలో ఉదయం ప్రహ్లాదవరద స్వామి కాళింగ నర్తనోత్సవ అలంకారంలో దర్శనమిచ్చారు.