ఆలూరు నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఆసియాబీచ్ సెపక్ తక్ర చాంపియన్ షిప్-2024 క్రీడా పోటీల్లో కాంస్య పతకంతో విజేతగా నిలిచిన కురువ మధును శుక్రవారం ఆలూరు టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన ఆయన మాట్లాడుతూ పేద కుటుంబం నుంచి చదువులోనే కాకుండా క్రీడలో రాణిస్తూ దేశ జట్టుకు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు.