ఆస్పరి మండలం కైరుప్పల గ్రామానికి చెందిన పక్కిరప్ప ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన అగ్ని ప్రమాద బాధితులను సీపీఐ నాయకులు ఆదివారం పరామర్శించారు. జిల్లా కార్యదర్శి గిడ్డయ్య మాట్లాడుతూ సర్వం కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు సేవా సమితి తరఫున రూ. 5000 చెక్కు, 1 క్వింటాల్ బియ్యాన్ని వారికి అందజేశారు.