దేవనకొండ మండల పరిధిలోని నేలతలమర్రి గ్రామంలో వెలిసిన కోరిన వెంటనే వరాలు ఇచ్చే చిన్న చందమామ, పెద్ద చందమామ, ఇమామ్ కాశిమ్ స్వాముల వార్ల పీర్ల పండగ సంబరాలు బుధవారం సాయంత్రం నుంచి మొదలయ్యాయి. సాయంత్రం పీర్ల చావిడి దగ్గర అలాయి తీసుకొని, ఆతరువాత స్వాముల వారి యొక్క సామాగ్రికి మరియు బంగారు, వెండి, మరియు ఇతర ఆభరణాలకు ముళ్ల సాహెబ్ వారి ఇంటి దగ్గర సదివింపులు చేసిన తరువాత అర్ధ రాత్రి 12:00 సమయంలో స్వాముల వారి ఆభరణాలను గ్రామంలోని వీధులల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు పక్క గ్రామాల ప్రజలు మరియు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి పాల్గొన్నారు.