
హలహర్వి మండలంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న వేళ శనివారం టీడీపీ ఇన్చార్జ్ వీరభద్ర గౌడ్ ఆలూరు నియోజకవర్గంలో వేడుకలు నిర్వహించారు. ఆలూరు, హలహర్వి, సిరిగాపురం గ్రామాల్లో టీడీపీ జెండా ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో సీనియర్ నేతలు, మండల కన్వీనర్లు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిస్తామని నేతలు సంకల్పం వ్యక్తం చేశారు.