టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలి

565చూసినవారు
కొలిమిగుండ్ల మండలంలోని కోర్నపల్లెలో ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుపై టీడీపీ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి బూతులతో రెచ్చిపోవడంతో శుక్రవారం ఎరుకలి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఉపాధ్యాయుడికి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. పోలీసుస్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. తక్షణమే టీచర్ ను డిప్యూటేషన్ మీద ఇతర పాఠశాలకు బదిలీ చేయాలని ఎంఈవోకు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్