బనగానపల్లెలో ఉచిత వైద్య సేవలు అభినందనీయం: మంత్రి బీసీ

61చూసినవారు
బనగానపల్లెలో ఉచిత వైద్య సేవలు అభినందనీయం: మంత్రి బీసీ
సంజామల మండల పరిధిలోని మంగపల్లెలో పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50వ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వాహకులు డా. పీ. దస్తగిరి రెడ్డితో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించడంపై దస్తగిరి రెడ్డిని మంత్రి బీసీ అభినందించారు. తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని మంత్రి బీసీ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్