మహాశివరాత్రి కళ్యాణోత్సవంకు ఆహ్వానిస్తూ బనగానపల్లె 5 గ్రామాల్లో పార్వేట ఉత్సవసంబరం నిర్వహిస్తారు అని
అలయ ప్రధాన అర్చకుడు మహేష్ శర్మ ఆదివారం తెలిపారు. ఎర్రమల కొండల్లో పర్వతసానువుల మధ్య వెలసి గర్భాలయంలో నిత్యమూ విశేష అలంకారాలతో, అభిషేకాలతో పూజలందుకునే బనగానపల్లె మండలంలోని యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామి దంపతులు మకర సంక్రాంతి రోజున ఉత్సవమూర్తుల రూపంలో బుధవారం కొండదిగి రానున్నారు.