3 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు మేలు కలిగించే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే వారికే మా ఓటు వేస్తామని యుటిఎఫ్ ప్యాపిలి మండల శాఖ అధ్యక్షులు కృష్ణా నాయక్ పేర్కొన్నారు. ప్యాపిలి మండలంలోని ఏనుగుమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రోజు మధ్యాహ్న భోజన విరామ సమయంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణా నాయక్ మాట్లాడారు.