Oct 11, 2024, 15:10 IST/
ఘోర ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొట్టిన ఎక్స్ప్రెస్ రైలు (వీడియో)
Oct 11, 2024, 15:10 IST
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. కవర్పేటై రైల్వే స్టేషన్లో సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును మైసూర్ఎ-దర్భంగ ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ (Train No. 12578) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. రెండు కోచ్లు అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.