సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ
ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎమ్మెల్యే జయసూర్య కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామానికి చెందిన సూది రెడ్డి కృష్ణవేణమ్మకు రూ. 1,45000/-, సంబంధించిన చెక్కును మంగళవారం అందజేశారు. ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే జయసూర్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, కన్వీనర్లు నారపురెడ్డి, పలుచాని మహేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, మన్సూర్ భాష, రఫీ తదితరులు పాల్గొన్నారు.