కొత్తపల్లి: మత్తుపదార్థాలకు బానిసలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి

82చూసినవారు
కొత్తపల్లి: మత్తుపదార్థాలకు బానిసలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి
యువత మత్తుపదార్థాలకు బానిసలు కాకుండా జాగ్రత్తగా ఉండాలని ఆత్మకూరు డీఎస్పీ రామంజినాయక్ అన్నారు. మంగళవారం రాత్రి కొత్తపల్లి మండల పరిధిలోని శివపురం గ్రామంలో ప్రజలకు మత్తుపదార్థాలు, డ్రగ్స్ వంటి వాటివల్ల కలిగే అనార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో యువత పాత్ర ఎంతో కీలకమన్నారు. అటువంటి యువత గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్థాలకు ఎక్కువగా బానిసలు అవుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్