పాఠశాల బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయరాదు
కొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల (బడి) లకు దగ్గరలో సిగరెట్లు బీడీలు అమ్మ రాదని ఎస్సై కేశవ గురువారం హెచ్చరించారు. ఎవరైనా పాఠశాల దగ్గరలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసిన ఎడల వారిపై పొగాకు నియంత్రణ చట్టం కింద జరిమానా విధించబడుతుందన్నారు. చిన్నపిల్లలకు సిగరెట్లు బీడీలు అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.