ప్రిపరేషన్ పై ఉచిత అవగాహన సదస్సు
కర్నూలు జిల్లా కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ లో విజేత స్టడీ సర్కిల్ నందు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డీఎస్సీ, గ్రూప్స్, ఎస్సై, కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్, ఉద్యోగాలు నోటిఫికేషన్లు ప్రిపరేషన్ పై శనివారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వై నాగేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సును ఉద్దేశించి కె.ఎస్.లక్ష్మణరావు కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి సభ్యులు మరియు పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ మాట్లాడుతూ నోటిఫికేషన్లు జూన్ నెల నుంచి వచ్చే అవకాశం ఉందని వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిందన్నారు. అభ్యర్థులందరూ నోటిఫికేషన్ రాగానే సిలబస్ మొదట అధ్యయనం చేయాలనీ సూచించారు. ఏకాగ్రతతో పట్టుదలతో టెక్స్ట్ పుస్తకాలను కూడా అధ్యయనం చేయాలని, అలాగే ప్రతి రోజు న్యూస్ పేపర్ బాగా స్టడీ చేయాలని సూచించారు. సబ్జెక్టుల్లో అయితే అవగాహనతో అర్థం చేసుకుంటేనే ఉద్యోగం వస్తాయన్నారు.