చెత్తాచెదారాన్ని తొలగిస్తాం: సర్పంచ్

1078చూసినవారు
చెత్తాచెదారాన్ని తొలగిస్తాం: సర్పంచ్
పెద్దకడబూరు గ్రామంలోని డ్రైనేజీలలో నిండిపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పారిశుద్ధ్యాన్ని నెలకొల్పుతామని గ్రామ సర్పంచ్ రామాంజనేయులు స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దకడబూరులోని ప్రధాన రహదారి వెంబడి, కురువ వీధి మరియు ఆయా కాలనీల్లో డ్రైనేజీ పూడిక తీయించి చెత్తాచెదారాన్ని ఊరి బయటకు తరలించారు. సర్పంచ్ మాట్లాడుతూ పెద్దకడబూరు గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్