కర్నూలు జిల్లాలోని కౌతాళం మండలం మరళి- 1 ఇసుక రీచ్ కు వేసిన టెండర్ ను రద్దు చేసినట్లు గనులు భూగర్భ ఖనిజశాఖ ఉప సంచాలకులు రవిచందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెండరు దక్కించుకున్న బంగారప్ప తగిన సమయంలో డిపాజిట్ చెల్లించక పోవడంతో రద్దు చేసినట్లు తెలిపారు. డిపాజిట్ ఈనెల 14 సాయంత్రం లోపు చెల్లించాల్సి ఉండగా చెల్లించలేదన్నారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 17న రీటెండర్ కు ప్రకటన ఇవ్వనున్నట్లు తెలిపారు.