వెన్నెల వాన - పుస్తకావిష్కణ

80చూసినవారు
వెన్నెల వాన - పుస్తకావిష్కణ
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్. మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న రచించిన 36వ కొత్త పుస్తకం 'వెన్నెల వాన'తోపాటు సమతా సాహితీ సుమాలు, తుషార బిందువులు వారి మరో రెండు పుస్తకాలు రాఘవ స్మారక సమితి గౌరవ అధ్యక్షులు, కళాబంధు కె. చెన్నప్ప, రాఘవ స్మారక సమితి ఉపాధ్యక్షులు, ప్రఖ్యాత రంగస్థల కళాకారులు రమేష్ గౌడ పాటిల్, డా. ఎ. లక్ష్మీనారాయణ మరియు సమతా సాహితీ సంస్థ అధ్యక్షులు డా. శ్రీ కె. సురేంద్ర బాబుల చేతుల మీద కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి రాఘవ కళామందిరం, బళ్ళారిలో ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం సోమన్న విరచిత "సమతా సాహితీ సుమాలు" పుస్తకాన్ని సురేంద్ర బాబు దంపతులకు అంకితం చేశారు. అనతి కాలంలో 36పుస్తకాలు రచించిన బాలసాహిత్యవేత్త సోమన్నను వారి తెలుగు సాహితీ కృషిగాను "బాల బంధు" బిరుదుతో సమతా సాహితీ సంస్థ అధ్యక్షులు డా. సురేంద్ర బాబు, కార్యదర్శి రామాంజనేయులు మరియు సభ్యులు సగౌరవంగా సత్కరించారు.

ట్యాగ్స్ :