సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరం లాంటిదని నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య సూర్య అన్నారు. సోమవారం నందికొట్కూరు పట్టణంలోని లింగం వీధికి చెందిన ఉరుకుంద మాధవికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన, రూ. 73, 730/-, చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, కౌన్సిలర్లు వాణి, రవీంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ తదితరులు పాల్గొన్నారు.