ఉమ్మడి కర్నూలు జిల్లా నగరంలో కోల్స్ కళాశాల నందు ఈనెల 18 నిర్వహించే మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమమునకు భారీ ఎత్తున మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు నందికొట్కూరు మండల ఇన్ చార్జ్ కెవి రమణ మాదిగ మంగళవారం పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ నందికొట్కూరు మండల ఇన్ చార్జ్ కె. వి రమణ మాదిగ ఆధ్వర్యంలో శాతనకోట, బొల్లవరం, దామగట్ల గ్రామాలలో పర్యటించారు.