ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ మరియు డిస్టిక్ లీగల్ సర్వీస్ ఆదేశాల మేరకు నందికొట్కూరు పట్టణంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సిపిడిఓ ఆధ్వర్యంలో మహిళలకు న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూనియర్ సివిల్ జడ్జి దివ్య హాజరయ్యారు. జడ్జి దివ్య మాట్లాడుతూ మహిళలకు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలన్నారు.