గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ జిల్లా నాయకులు ఎం. రమేష్ బాబు, గిరిజన సమైక్య నాయకులు పుల్లన్న, వెంకటరమణ రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం శ్రీశైలం ఐ టి డి ఏ పి ఓ, ఆత్మకూరు ఆర్డీవోలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మకూరు ప్రాంతంలో నివాసముంటున్న గిరిజనులకు కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య నాయకులు పాల్గొన్నారు.