నంద్యాల జిల్లాలో జిల్లాలో 2024- 25 వార్షిక రుణాల ప్రణాళిక కింద వివిధ బ్యాంకుల ద్వారా 12, 828 కోట్లు రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధ్యక్షతన బ్యాంకర్ల సమన్వయ సమావేశం జరిగింది. వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.