ఆన్లైన్ పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో మీ కోసం కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనాథ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రాజు, ఏఐవైఎఫ్ నేత జాఫర్ పటేల్ మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో భూ రీసర్వే తప్పుల వలన చాలామంది రైతులకు భూ సమస్య అలాగే ఉందన్నారు. భూమి రిజిస్ట్రేషన్ అయినా కూడా ఆన్లైన్ కాకపోవడంతో రైతులు ఇబ్బందులకు పడుతున్నారన్నారు.