గత ఆగస్టు 30, 31 తేదీలలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గృహాలకు నష్టపరిహారం అందించామని సాంకేతిక కారణాలవల్ల పరిహారం అందని బాధితులకు నగదు పంపిణీ చేస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వెల్లడించారు. సోమవారం కలెక్టర్ లోని సెంటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలలో భాగంగా నష్టపరిహారం అందని పదిమంది బాధితులకు లక్ష రూపాయల నగదును బాధితులకు అందజేశారు.