కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న బోయ రమేష్ అభ్యర్థన మేరకు శనివారం కోర్టు న్యాయం చేసింది. తన కుమారుడిని కడప పాఠశాలలో చేర్పించాలని కోర్టుకు విన్నవించడంతో కర్నూలు న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి, జిల్లా శిశు సంక్షేమ అధికారులు కర్నూలులోని మధు ఇంటికెళ్లి బాలుడిని చేరదీసి, కడప పిల్లల సంక్షేమ కమిటీ అధికారులకు అప్పగించారు.