రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నంద్యాల 17 వార్డు టిడిపి ఇంచార్జ్ రామ మద్దయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం (లక్ష రూపాయల సభ్యత్వం) గురువారం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ రామ మద్దయ్యను అభినందించడం జరిగింది.