నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశంలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి హాజరై మాట్లాడారు. ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.