నంద్యాల పట్టణంలో నిర్వహించిన సగర కార్తీక వనభోజన మహోత్సవాలు అంగరంగ వైభవంగా మంగళవారం ముగిశాయి. బాలభవన్ నాట్యాలయ చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, జానపద కళారూపాలు సగరులను ఆకట్టుకున్నాయి. బాలభవన్ సూపరిండెంట్ ప్రసాద్ రెడ్డి, డాన్స్ మాస్టర్ నరసింహులు సేవా సంఘం సభ్యుల ద్వారా ఘనంగా సత్కరించబడ్డారు. చిన్నారులకు మెమెంటోలను అందజేశారు.