నంద్యాల 4 వార్డ్ టిడిపి ఇంచార్జ్ మజీద్ ఆధ్వర్యంలో వైసీపీ 4 వార్డ్ కౌన్సిలర్ తబ్రేజ్, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సమక్షంలో టీడీపీలో బుధవారం చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఫిరోజ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాలలో అన్ని సామాజిక వర్గాల ప్రజలు వైసీపీని వీడే పరిస్థితికి వైసిపి పార్టీ దిగజారిందని అన్నారు.