నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, హంస అవార్డు గ్రహీత చింతలపల్లి కోటేష్ ఒకే పెన్సిల్ పై 9 జగన్మాత అవతారాలను చిత్రీకరించాడు. చిత్రకారుడు మాట్లాడుతూ పెన్సిల్ పై మూడు వైపులా 9 చిత్రాలను గీశానని, ఇందుకు అరగంట సమయం పట్టిందని తెలిపారు. దుర్గమ్మ మహిషాసురుడితో 9 రాత్రులు భీకరంగా యుద్ధం చేసి సంహరించింది. ఇందుకు ప్రజలు పదవరోజు సంతోషంతో పండుగ జరుపుకున్నారు అని అన్నారు.