నంద్యాల జిల్లాలో ప్రారంభించిన సిసి రోడ్ల నిర్మాణ పనుల పూర్తికి నాలుగు వారాలు మాత్రమే సమయం ఉందని నాణ్యత ప్రమాణాలు పాటించి మండలాల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. గురువారం నంద్యాల కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసి రోడ్ల నిర్మాణ పనుల ప్రగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.