ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని, నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సోమవారం కలెక్టరేట్‌లో మరుగుదొడ్ల నిర్వహణపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఆమె ప్రభుత్వ కార్యాలయాలలో ఉన్న మరుగుదొడ్ల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరమ్మతులు చేపట్టాలని, క్షేత్ర స్థాయిలో మరుగుదొడ్ల నిర్వహణను సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.