వైసీపీ ఎమ్మెల్యేకు బిగుస్తున్న ఉచ్చు!

72చూసినవారు
వైసీపీ ఎమ్మెల్యేకు బిగుస్తున్న ఉచ్చు!
AP: అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి మెడకు భూకబ్జాల ఉచ్చు బిగుస్తోంది. ఎమ్మెల్యే వందల ఎకరాల భూమి కబ్జాలకు పాల్పడ్డాడని రాజంపేట టీడీపీ నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దాంతో కబ్జాలపై విచారణకు సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యేతో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులకు జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. శనివారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఎదుట ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి, కుటుంబ సభ్యులు విచారణకు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్