యూపీలోని డియోరియాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ బాలిక (12) పని కోసం పక్కింటికి వెళ్లింది. ఇదే అదనుగా ఆ ఇంట్లోని వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో తల్లి వెంటనే అక్కడికి రాగా అతను పారిపోయాడు. ఈ ఘటనపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.