కల్లూరు మండలం కె. మార్కాపురం గ్రామంలో శుక్రవారం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు ప్రారంభించారు. కార్యక్రమానికి ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు ముఖ్యఅతిథిగా హాజరై పనులు ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో వలసల నివారణకు ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టిందని గ్రామస్తులు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.