పత్తికొండ: అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వీడాలి

82చూసినవారు
పత్తికొండ: అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వీడాలి
అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వీడాలని పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు అన్నారు. బుధవారం పట్టణంలోని సచివాలయం-3ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టార్ లో ఆరుగురు సిబ్బంది సంతకాలు చేసి బయటకు వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతు భరోసా కేంద్రంలో పాడైపోపోయిన యూరియా బస్తాలను చూసి ఇదేనా కార్యాలయం నిర్వహించే తీరని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్