పత్తికొండ: రూ. 5. 53 లక్షల ఎరువుల అమ్మకాల నిలిపివేత

68చూసినవారు
పత్తికొండ: రూ. 5. 53 లక్షల ఎరువుల అమ్మకాల నిలిపివేత
నకిలీ ఎరువు విక్రయంపై ఓ రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పత్తికొండ పట్టణంలో ఒక ఫర్టిలైజర్ దుకాణాన్ని వ్యవసాయశాఖ అధికారి వెంకటరాముడు శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల స్టాక్ ను పరిశీలించారు. దుకాణంలో రూ. 5. 53 లక్షల విలువ చేసే ఎరువులు అమ్మకాలు నిలుపుదల చేయాలని ఆదేశించారు. స్టాకు, ధరల వివరాలను ప్రతిరోజు ఏర్పాటు చేయాలని, కొనుగోలు చేసిన రైతులకు రసీదులు ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్