పీహెచ్ఎన్ కు ఘన సన్మానం
తుగ్గలి మండలం పగిడిరాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పబ్లిక్ హెల్త్ నర్స్ గా పనిచేస్తున్న శాంతమ్మ పదవీ విరమణ చేయడంతో ఆమెను వైద్య అధికారిని డాక్టర్ హరిత, వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించారు. డాక్టర్ హరిత మాట్లాడుతూ శాంతమ్మ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఎన్నో వైద్య సేవలు అందించి ప్రజల మన్నలు పొందారన్నారు. కార్యక్రమంలో సూపర్ వైసర్ బండయ్య, యూడీసీ పరమేశ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.