HYDRA: 5 అంతస్తుల భారీ బిల్డింగ్‌ను కూల్చేశారు (వీడియో)

58చూసినవారు
హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో 5 అంతస్తుల భారీ బిల్డింగ్ ను బాహుబలి క్రేన్ సహాయంతో నేలమట్టం చేశారు. పెద్ద బిల్డింగ్ ఒక్కసారిగా నేలకూలిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ భవనం ఓ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ గా తెలుస్తోంది. మరోవైపు కూకట్ పల్లి నల్లచెరువులో 16 షెడ్లను సైతం కూల్చేశారు.

సంబంధిత పోస్ట్