సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న వరుస వార్తలపై నటి సిమ్రన్ మండిపడ్డారు. ‘ఇతరులు మిమ్మల్ని మానసికంగా తారుమారు చేయడం.. ఆ విషయాలను మీ స్నేహితులు నమ్మడం చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఇప్పటివరకూ నేను నిశ్శబ్దంగా ఉన్నా. కానీ, ఇప్పుడు చెబుతున్నా. ఏ పెద్ద హీరోతోనూ పనిచేయాలనే కోరిక నాకు లేదు. ఇప్పటికే వారితో చాలా సినిమాల్లో చేశా. ఇప్పుడు నా లక్ష్యాలు చాలా భిన్నంగా ఉన్నాయి. నా పరిమితులు నాకు తెలుసు' అని పేర్కొన్నారు.