సోషల్ మీడియాలో యవత పిచ్చి మరీ ముదిరిపోతోంది. రీల్స్ కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తోటి వారికి ఇబ్బంది కలిగిస్తూ ప్రవర్తిస్తున్నారు. తాజాగా అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఇద్దరు యువకులు బైకుపై వెళ్తూ పక్కనే సైకిల్‌పై వెళుతున్న వృద్ధుడి మీద స్ప్రే చల్లారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ఆ యువకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.