అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలో శివ సర్కిల్ శనివారం ఉదయం ప్రధాన కూడళ్లలో ప్రజలకు పాంప్లెంట్ పంపిణీ చేయడం జరిగింది. స్థానిక శివ సర్కిల్లో వాటర్ ప్రదర్శన అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక అధికారి జి రామాంజనేయులు ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ రకాల అగ్ని ప్రమాదాలు వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలు, ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదం జరిగినప్పుడు వివిధ రకాల పరికరాల వాడకంపై అవగాహన కల్పించారు. గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అయినప్పుడు భయపడకుండా దుప్పటిని తడిపి సిలిండర్ చుట్టూ కప్పి ఆర్పే ప్రయత్నం చేయాలని అగ్నిమాపక అధికారి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలపడానికి అగ్ని మాపక సిబ్బంది ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు అవగాహన సదస్సులు, మాక్ డ్రిల్‌లను అగ్నిమాపక స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జి. రామాంజనేయులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ మస్తాన్వలి, హెడ్ కానిస్టేబుల్ సర్దార్ భాష, గోపాల్, వెంకటేష్, ఫైర్ మాన్ ఆంజనేయులు, ఈరన్న, చిన్న రాముడు, హోంగార్డు రమేష్, పరమేష్, విశ్వనాథ్ రెడ్డి, అగ్నిమాపక అధికారులు పాల్గొన్నారు.