ప్రసవ వేదన.. అడవిలో 5 కి.మీ నడిచిన గర్భిణి

81చూసినవారు
ప్రసవ వేదన.. అడవిలో 5 కి.మీ నడిచిన గర్భిణి
ప్రసవ వేదనను భరిస్తూ చికిత్స కోసం ఓ గర్భిణి కటిక చీకట్లో సుమారు 5 కి.మీ. నడిచిన ఘటన ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం గబ్బిలాలగొందికి చెందిన కోండ్ల సీతకు శనివారం రాత్రి నొప్పులు వచ్చాయి. సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుగులో 5 గంటలపాటు రాళ్లు, గుట్టల మధ్య ఆమె భర్తతో కలిసి నడిచింది. ముల్లూరు ప్రధాన రహదారిపై అటుగా వస్తున్న ఆటో ఆగడంతో సీతను ఎక్కించి కూటూరు ఆస్పత్రికి తరలించారు. తరవాత ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది.

సంబంధిత పోస్ట్