ఏపీలోని కల్లుగీత కులాలకు మద్యం షాపులను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాల వారీగా జాబితాలు సిద్ధమవగా వారంలో రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిసింది. గత ఏడాది అక్టోబరులో కొత్త మద్యం విధానం తీసుకొచ్చింది. 2016లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వేని కులాల జనాభాకు ప్రామాణికంగా చేసి జిల్లాల వారీగా షాపులు కేటాయించనున్నారు. 340 షాపులను ఈ కులాలకు ప్రభుత్వం రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.